నెలాఖరులోగా నూతన టూరిజం విధానం | new tourisam plan in feb ending says chandrababu naidu | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా నూతన టూరిజం విధానం

Feb 9 2015 3:57 PM | Updated on Jun 2 2018 3:08 PM

నెలాఖరులోగా నూతన టూరిజం విధానం - Sakshi

నెలాఖరులోగా నూతన టూరిజం విధానం

పిబ్రవరి నెలాఖరునాటికి నూతన టూరిజం విధానాన్ని అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్: పిబ్రవరి నెలాఖరునాటికి నూతన టూరిజం విధానాన్ని అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. టూరిజం విదివిధానాలపై ఆయన సోమవారమిక్కడ ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  తిరుపతి లో కొత్త టూరిజం పాలసీ ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు.

ప్రతి 2 లేదా 3 నెలలకు ఫుడ్ ఫెస్టివల్ సహా ఇతర కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులతో పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్నారు. 2020 నాటికి పర్యాటక రంగం ద్వారా రూ. 10 వేల కోట్లు ఆదాయం వచ్చేలా కృషి చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement