కుదేలైనా నిర్మాణ రంగం, ప్రభుత్వం ఆదుకోవాలి

National Real Estate Development Council Meeting At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: కరోనాతో అన్నిరంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నెరెడ్కో)రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమర్నాధ్‌ తెలిపారు. విజయవాడలో గురువారం నెరెడ్కో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెరెడ్కో ఉపాధ్యక్షుడు అమర్నాధ్‌ మాట్లాడుతూ... నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. ప్రస్తుత పరిస్థితి లో ప్రభుత్వమే ఆదుకోవాలి . సిమెంట్, ఐరన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. మార్కెట్ లేకపోయినా... సిండికేట్‌గా మారి ‌ధరలు పెంచేశారు. ధరలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి . వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2008 లో ఐదు శాతం  స్టాంపు‌ డ్యూటీ తగ్గించి రియల్‌ఎస్టేట్‌ రంగాన్ని ఆదుకున్నారు. నేడు వ్యాపారం ముందుకు సాగే పరిస్థితి లేనందున ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఆదుకోవాలి.నిర్మాణ రంగాన్ని కూడా పరిశ్రమ గా గుర్తించి, ప్రోత్సాహించాలి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వల్ల నిర్మాణ రంగానికి ప్రయోజనం లేదు. రియల్ ఎస్టేట్ యాభై శాతం పడిపోయిందని అంటున్నారు. కృష్ణా జిల్లాలో  పూర్తిగా పడిపోలేదు. ప్రభుత్వం ధరలు నియంత్రణ చేసేలా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం సహకారం అందిస్తే... ఆదాయం రావడంతో పాటు,  లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కలుగుతుంది అని తెలిపారు. అదేవిధంగా 7.5 స్టాంపు డ్యూటీ ని 2.5 కి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి అందించే ధరలకే‌ సిమెంట్, ఐరన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. (వైఎస్ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ)

 ఇక నగర జాయింట్‌ సెక్రటరీ హరిప్రసాద్ మాట్లాడుతూ... లాక్ డౌన్ ప్రభావం నిర్మాణ రంగం పై బాగా పడింది. కార్మికులు అందరూ పనులు లేక స్వగ్రామాలకు వెళ్లిపోయారు.  కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ భవిష్యత్తు లో బాగుంటుంది.. ఇప్పుడు ఎటువంటి ఉపశమనం ఉండదు. ప్రస్తుత పరిస్థితి లో యేడాది పాటు ప్రభుత్వమే సహకారం ఇవ్వాలి. ఈ మూడు నెలల్లో సిమెంట్, ఐరన్ రేట్లు బాగా పెరిగాయి .  ప్రభుత్వం ఇచ్చే సహకారం పైనే నిర్మాణ రంగం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని అన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top