9 మంది టీచర్లకు జాతీయ అవార్డులు | Sakshi
Sakshi News home page

9 మంది టీచర్లకు జాతీయ అవార్డులు

Published Wed, Sep 6 2017 1:56 AM

National Awards for 9 Teachers

ఢిల్లీలో ఉపరాష్ట్రపతి చేతులమీదుగా అందజేత
 
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది టీచర్లు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా మంగళవారం అవార్డులు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తొమ్మిది మంది టీచర్లు అవార్డులు అందుకున్నారు.

పురస్కారాలు స్వీకరించిన వారిలో గోరంట్ల శ్రీనివాసరావు, చిలుకూరి శ్రీనివాసరావు, నల్లెబోయిన విమలకుమారి, ఎర్రా ఎస్‌ఎస్‌జీఎస్‌ చక్రవర్తి, గొట్టేటి రవి, చాగంటి శ్రీనివాసరావు, బొంతలకోటి శంకరరావు, డి.ధర్మరాజు, రెడ్డి లోకానందరెడ్డి ఉన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement