సీమాంధ్రులను అవమానపరచడం కేసీఆర్ కు తగదు | narayana fires kcr comments | Sakshi
Sakshi News home page

సీమాంధ్రులను అవమానపరచడం కేసీఆర్ కు తగదు

Sep 30 2013 8:27 PM | Updated on Aug 15 2018 9:17 PM

సీమాంధ్రులను అవమానపరచడం కేసీఆర్ కు తగదు - Sakshi

సీమాంధ్రులను అవమానపరచడం కేసీఆర్ కు తగదు

టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సీమాంధ్రులను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలు సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు.

కడప: టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సీమాంధ్రులను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలు సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. తెలంగాణను సానుకూల ధోరణిలో తెచ్చుకోవాల్సిన సమయంలో ఈ రకమైన వ్యాఖ్యలు తగదని సూచించారు.' ఆంధ్రలో పుట్టిన వారంతా తెలంగాణ ద్రోహులే' అని కేసీఆర్ ఆదివారం నిజాం కళాశాల ఆవరణలో జరిగిన సభలో ప్రసంగించిన సంగతి తెలిసిందే.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కొరకు విశాఖ సహకారం అవసరమని తెలిపారు.

హైదరాబాద్ నగరం..కేసీఆర్ సొత్తు కాదు, లగడపాటి రాజగోపాల్ సొత్తుకాదన్నారు. హైదరాబాద్ అనేది కమ్యూనిస్టుల పోరాటం నుంచి విముక్తి పొందిన నగరమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement