
'సైనికులు లేని సైన్యాధిపతి సీఎం కిరణ్'
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు.
వీర్లపాడు: రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. కృష్ణా జిల్లా వీర్లపాడు మండలంలో భారీ వర్షాల కారణంగా నీటమునిగిన పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు.
పంట నష్టం వివరాలను అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. తగిన నష్టపరిహారం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సైనికులు లేని సైన్యాధిపతి సీఎం కిరణ్ అంటూ నారాయణ ఎద్దేవా చేశారు.