breaking news
Veerlapadu
-
వీర్లపాడు రచ్చబండ కార్యక్రమం రసాభాస
కృష్ణా: రచ్చబండ కార్యక్రమంలో ప్రజలకు, రాజకీయనాయకుల వాగ్వాదం చోటు చేసుకున్న ఘటన జిల్లాలోని వీర్లపాడులో శుక్రవారం చోటు చేసుకుంది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రచ్చబండకు ఆలస్యంగా రావడంతో కోపోద్రోక్తులైన ప్రజలు ఆయన తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. దీంతో ప్రజలను ఎంపీ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రచ్చబండలో తమ సమస్యలను వివరించాలని వచ్చిన ప్రజలకు ఈ ఘటన మరింత ఆవేశం తెప్పించింది. ఈ క్రమంలోనే ప్రజలకు, పోలీసులకు తోపులాట జరిగింది. అనంతరం మాట్లాడిన రాజగోపాల్ ప్రజా సమస్యలను మరిచి మాట్లాడారు.ఈయన పోకడ ప్రజలకు నచ్చకపోవడంతో రచ్చబండ కార్యక్రమంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. -
'సైనికులు లేని సైన్యాధిపతి సీఎం కిరణ్'
వీర్లపాడు: రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. కృష్ణా జిల్లా వీర్లపాడు మండలంలో భారీ వర్షాల కారణంగా నీటమునిగిన పంటలను శుక్రవారం ఆయన పరిశీలించారు. పంట నష్టం వివరాలను అన్నదాతలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. తగిన నష్టపరిహారం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సైనికులు లేని సైన్యాధిపతి సీఎం కిరణ్ అంటూ నారాయణ ఎద్దేవా చేశారు.