వీర్లపాడు రచ్చబండ కార్యక్రమం రసాభాస | People create ruckus at rachabanda in krishna district | Sakshi
Sakshi News home page

వీర్లపాడు రచ్చబండ కార్యక్రమం రసాభాస

Nov 15 2013 2:36 PM | Updated on Sep 2 2017 12:38 AM

రచ్చబండ కార్యక్రమంలో ప్రజలకు, రాజకీయనాయకుల వాగ్వాదం చోటు చేసుకున్న ఘటన జిల్లాలోని వీర్లపాడులో శుక్రవారం చోటు చేసుకుంది.

కృష్ణా: రచ్చబండ కార్యక్రమంలో ప్రజలకు, రాజకీయనాయకుల వాగ్వాదం చోటు చేసుకున్న ఘటన జిల్లాలోని వీర్లపాడులో శుక్రవారం చోటు చేసుకుంది.  విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రచ్చబండకు ఆలస్యంగా రావడంతో కోపోద్రోక్తులైన ప్రజలు ఆయన తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. దీంతో ప్రజలను ఎంపీ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రచ్చబండలో తమ సమస్యలను వివరించాలని వచ్చిన ప్రజలకు ఈ ఘటన మరింత ఆవేశం తెప్పించింది. ఈ క్రమంలోనే ప్రజలకు, పోలీసులకు తోపులాట జరిగింది.

 

అనంతరం మాట్లాడిన రాజగోపాల్ ప్రజా సమస్యలను మరిచి మాట్లాడారు.ఈయన పోకడ ప్రజలకు నచ్చకపోవడంతో రచ్చబండ కార్యక్రమంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement