ఎంపీ కేశినేనికి లోకేష్‌ ఫోన్‌ | Nara Lokesh calls to MP Kesineni | Sakshi
Sakshi News home page

ఎంపీ కేశినేనికి లోకేష్‌ ఫోన్‌

Jun 13 2017 6:55 PM | Updated on Aug 29 2018 3:37 PM

ఎంపీ కేశినేనికి లోకేష్‌ ఫోన్‌ - Sakshi

ఎంపీ కేశినేనికి లోకేష్‌ ఫోన్‌

ఎంపీ కేశినేని నానికి మంత్రి నారా లోకేష్ ఫోన్ చేశారు..

విజయవాడ: ఎంపీ కేశినేని నానికి మంత్రి నారా లోకేష్ ఫోన్ చేశారు. బస్సుల వివాదంపై ఎవరితో మాట్లాడవద్దని ఆదేశించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని,  తాను విదేశాల నుంచి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడదామని లోకేష్‌ ఆయనతో చెప్పారు. సోమ, మంగళవారాల్లో తాను చేసిన వ్యాఖ్యల గురించి కేశినేని లోకేష్‌కు వివరించారు. పార్టీ, సీఎం చంద్రబాబు, మీరూ ముఖ్యమని లోకేష్‌తో అన్నట్లు తెలుస్తోంది.

కేశినేని నాని ఏపీ రవాణ శాఖ అవినీతిమయంగా మారిందంటూ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తే ఏపీ రవాణాశాఖ ఉన్నతాధికారులకు చీమ కుట్టినట్లయినా లేదని ఆయన ఘాటుగా విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement