‘ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు’ | nandamuri harikrishna condolences to Minister Narayana family | Sakshi
Sakshi News home page

‘ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు’

May 10 2017 9:58 AM | Updated on Sep 5 2017 10:51 AM

‘ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు’

‘ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు’

కన్న కొడుకును కోల్పోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసునని సినీ నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ అన్నారు.

హైదరాబాద్‌:  కన్న కొడుకును కోల్పోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసునని సినీ నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ అన్నారు. మంత్రి నారాయణ కుమారునికి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. కారు ప్రమాదంలో నారాయణ కుమారుడు నిషిత్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరికృష్ణ తనయుడు జానకిరామ్‌ మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారు వద్ద 2014, డిసెంబర్‌ 6న జరిగిన ప్రమాదంలో జానకిరామ్‌ ప్రాణాలు కోల్పోయారు.

మంత్రి నారాయణ కుమారుడి ఆకస్మిక మరణం పట్ల కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్ర ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement