breaking news
Minister Narayana son
-
నిశిత్ కారు ప్రమాదం వీడియో...
-
‘ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు’
-
‘ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు’
హైదరాబాద్: కన్న కొడుకును కోల్పోతే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసునని సినీ నటుడు, టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ అన్నారు. మంత్రి నారాయణ కుమారునికి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. కారు ప్రమాదంలో నారాయణ కుమారుడు నిషిత్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరికృష్ణ తనయుడు జానకిరామ్ మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్లగొండ జిల్లా ఆకుపాముల శివారు వద్ద 2014, డిసెంబర్ 6న జరిగిన ప్రమాదంలో జానకిరామ్ ప్రాణాలు కోల్పోయారు. మంత్రి నారాయణ కుమారుడి ఆకస్మిక మరణం పట్ల కేంద్ర మంత్రి సుజనా చౌదరి తీవ్ర ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబ సభ్యులకి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. -
నిషిత్ మృతిపై నేతల దిగ్భ్రాంతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి. నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిషిత్ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆవాస విభాగం అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనేందుకు కెన్యా రాజధాని నైరోబీ వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రమాదం గురించి తెలియగానే నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసన మండలి చైర్మన్ ఏ చక్రపాణి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పితాని సత్యనారాయణ, కెఎస్ జవహర్, పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, తదితరులు సంతాపం ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. నారాయణ కుటుంబసభ్యులకు విషాద సమయంలో బాసటగా నిలిచేందుకు మంత్రి కామినేని శ్రీనివాస్ నెల్లూరు వెళుతున్నట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన నారాయణ కుటుంబానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.