నిషిత్‌ మృతిపై నేతల దిగ్భ్రాంతి | political leaders condolences to Minister Narayana family | Sakshi
Sakshi News home page

నిషిత్‌ మృతిపై నేతల దిగ్భ్రాంతి

May 10 2017 9:33 AM | Updated on Sep 5 2017 10:51 AM

నిషిత్‌ మృతిపై నేతల దిగ్భ్రాంతి

నిషిత్‌ మృతిపై నేతల దిగ్భ్రాంతి

మంత్రి డాక్టర్‌ పి. నారాయణ కుమారుడు నిషిత్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి డాక్టర్‌ పి. నారాయణ కుమారుడు నిషిత్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడం పట్ల రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిషిత్‌ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆవాస విభాగం అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొనేందుకు కెన్యా రాజధాని నైరోబీ వెళ్లిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రమాదం గురించి తెలియగానే నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, శాసన మండలి చైర్మన్ ఏ చక్రపాణి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పితాని సత్యనారాయణ, కెఎస్ జవహర్, పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌, తదితరులు సంతాపం ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్‌ తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. నారాయణ కుటుంబసభ్యులకు విషాద సమయంలో బాసటగా నిలిచేందుకు మంత్రి కామినేని శ్రీనివాస్ నెల్లూరు వెళుతున్నట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన నారాయణ కుటుంబానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement