దర్శక దిగ్గజం భారతీ రాజా మరణంపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ఆయన తన సహజమైన, రాజీపడని కథనంతో సినీరంగంలో ఒక విప్లవం సృష్టించారని కొనియాడారు. మా అందరికీ నిజమైన మార్గదర్శిగా నిలిచారన్నారు. ఆ మరపురాని గ్రామీణ కథలు, ఆ నిర్భయమైన దృక్పథం, ఆయన తెరపైకి తీసుకువచ్చిన వాస్తవికత సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటాయని అన్నారు. ఆయన అసాధారణమైన కృషిని, వారసత్వాన్ని వీక్షించడం, స్మరించుకోవడం మనందరికీ గౌరవమని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా భారతీ రాజా మరణం పట్ల రాజమౌళి తన సంతాపం వ్యక్తం చేశారు.
కాగా.. వయో, అనారోగ్య సమస్యలతో దర్శక దిగ్గజం భారతీ రాజా కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీ అంతా షాకింగ్‌కు గురైంది. తమిళనాడు సీఎం విజయ్ సైతం ఎమోషనల్ అయ్యారు. భారతీరాజాకు నివాళులర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. పలువురు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు భారతీ రాజాకు సంతాపం ప్రకటించారు.
Bharathiraja garu was a true pioneer who revolutionized cinema with his raw and uncompromising storytelling. Those unforgettable rural narratives, that fearless vision and the authenticity he brought to the screen will live on forever.
It was an honour to witness and celebrate…— rajamouli ss (@ssrajamouli) June 10, 2026


