టీసీ రాజన్‌ నిజమైన గాంధేయవాది.. వైఎస్‌ జగన్‌ సంతాపం | YS Jagan Condolences Over TC Rajan Death | Sakshi
Sakshi News home page

టీసీ రాజన్‌ నిజమైన గాంధేయవాది.. వైఎస్‌ జగన్‌ సంతాపం

Mar 22 2026 7:13 AM | Updated on Mar 22 2026 7:13 AM

YS Jagan Condolences Over TC Rajan Death

సాక్షి, అమరావతి: ప్రముఖ గాంధేయవాది, మాజీ ఎమ్మెల్యే ఠానేదార్‌ చిన్న రాజన్‌ (టీసీ రాజన్‌) మరణం పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గం నుంచి 1967లో స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన టీసీ రాజన్‌ విలువలకు కట్టుబడి పని చేశారని కొనియాడారు.

ఆచార్య ఎన్జీ రంగా అనుచరుడిగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు. జీవితాంతం నిజమైన గాంధేయవాదిగా నిలిచిన టీసీ రాజన్‌ నిస్వార్థ రాజకీయ నేతగా ప్రజాసేవకే అంకితం అయ్యారని గుర్తు చేశారు. నిండు నూరేళ్లకు పైగా జీవించిన టీసీ రాజన్‌ రాష్ట్ర రాజకీయాల్లో చిరస్మరణీయుడని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.         

 

Advertisement
 
Advertisement
Advertisement