అభిమానులకు బాలకృష్ణ ఆహ్వానం | Nandamuri Balakrishna Invite fans his daughter Marriage | Sakshi
Sakshi News home page

అభిమానులకు బాలకృష్ణ ఆహ్వానం

Aug 18 2013 10:06 PM | Updated on Aug 29 2018 1:59 PM

అభిమానులకు బాలకృష్ణ ఆహ్వానం - Sakshi

అభిమానులకు బాలకృష్ణ ఆహ్వానం

‘అభిమానులూ ఆశీర్వదించండి’ అంటూ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన అభిమానులను కోరారు.

సాక్షి, హైదరాబాద్: ‘అభిమానులూ ఆశీర్వదించండి’ అంటూ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన అభిమానులను కోరారు. తన రెండో కుమార్తె తేజస్విని వివాహం శ్రీభరత్‌తో ఈ నెల 21న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నందమూరి అభిమానులందరూ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని బాలకృష్ణ కోరారు. ఈ మేరకు బాలకృష్ణ తరఫున టీడీపీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement