
‘ఆనం’కు నోటీసులు జారీచేసిన నాంపల్లి కోర్టు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆనం వివేకానందరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆనం వివేకానందరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం బుధవారం ఆనం వివేకానందరెడ్డికి నోటీసులు జారీ చేసింది.
న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి రోజా తరఫున వాదనలు వినిపించారు.