
'నల్లపురెడ్డిపై కథనాలు అవాస్తవం'
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామా వార్తలు అవాస్తవమని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విషయంలో వస్తున్న కథనాలు అవాస్తవమని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా వైఎసీఆర్ సీపీ అధ్యక్ష పదవికి ప్రసన్నకుమార్ రెడ్డి రాజీనామా చేయలేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ వార్తలన్నీ అసత్యకథనాలని చెప్పారు. ఒక పార్టీకి, ఒక వర్గానికి కొమ్ముకాస్తున్న మీడియా దుష్ప్రచారం చేస్తోందని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.