చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించాలని వైఎస్‌ఆర్‌సీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.
నంద్యాల: చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించాలని వైఎస్‌ఆర్‌సీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తున్న బాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడన్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ నుంచి టీడీపీలో చేరేందుకు భూమా కుటుంబం రూ. 45 కోట్లు తీసుకుందని ఆయన ఆరోపించారు. నంద్యాల ప్రజలు డబ్బుకు అమ్ముడుపోయే రకం కాదని, ఈ విషయాన్ని బాబు గుర్తించుకోవాలని సూచించారు.