జిల్లా కేంద్రంలోని లతీఫుల్లాషాఖాద్రీ ఉర్సు గురువారం ఘనంగా ప్రారంభమయ్యింది. కలెక్టర్ టి.చిరంజీవులు గంధాన్ని మోసుకువచ్చి ఉత్సవాలను ప్రారంభించారు.
నల్లగొండ కల్చరల్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రంలోని లతీఫుల్లాషాఖాద్రీ ఉర్సు గురువారం ఘనంగా ప్రారంభమయ్యింది. కలెక్టర్ టి.చిరంజీవులు గంధాన్ని మోసుకువచ్చి ఉత్సవాలను ప్రారంభించారు. స్థానిక గడియారం సెంటర్‌లోని మదీనా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనల అనంతరం కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ డాక్టర్ టి.ప్రభాకర్‌రావు, ఉర్సు ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు ఎంఏ బేగ్, ముతవల్లి అరీఫుల్లాఖాద్రీలు గంధాన్ని ఎత్తుకుని ఉర్సు ఊరేగింపునకు ప్రారంభించారు. ఉర్సు భారీ ఊరేగింపు గడియారం మీదుగా ఆర్పీ రోడ్డు, వన్ టౌన్ చౌరస్తా, పాతబస్తీ కమాన్‌ల మీదుగా లతీఫుల్లాషాఖాద్రీ మెట్ల వరకు చేరుకుంది. ఈ సందర్భంగా పకీర్ల విన్యాసం చూపరులను ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ టి.ప్రభాకర్‌రావు తదితరులు గంధం ఊరేగింపునకు స్వాగతం పలికారు.
అనంతరం గంధా న్ని లతీఫుల్లాషాఖాద్రీ దర్గా వరకు తీసుకొని వెళ్లేందుకు ముతవల్లీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాం మోహన్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ నాయకులు కంచర్ల భూపాల్‌రెడ్డి, ఫషాహత్ అలీ బాబా, వంగాల అని ల్‌రెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, ఖాజాకుత్బుద్దీన్, హాషం, పులిజాల రాంమోహన్‌రావు, ముతవల్లీలు బషారుతుల్లాఖాద్రీ, జమాలత్ ఉల్లాఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.