కన్నీటి వీడ్కోలు | MVS haranatha rao funeral programme compleat | Sakshi
Sakshi News home page

కన్నీటి వీడ్కోలు

Oct 11 2017 9:40 AM | Updated on Oct 11 2017 9:40 AM

MVS haranatha rao funeral programme compleat

రోధిస్తున్న కుమార్తె, భార్య , అంతిమ యాత్రలో ఆయన ఇద్దరు కుమారులు

ఒంగోలు కల్చరల్‌: ప్రముఖ సినీ, నాటక రచయిత ఎం.వి.ఎస్‌. హరనాథరావు అంత్యక్రియలు మంగళవారం స్థానిక ఆర్‌టీసీ బస్టాండ్‌ వద్ద గల మహాప్రస్థానం శ్మశానవాటికలో హైందవ సంప్రదాయబద్ధంగా జరిగాయి. అంతిమ యాత్రలో కళాకారులు, కళాభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హరనాథ«రావుతో ప్రగాఢ అనుబంధం ఉన్న పలువురు కళాకారులు ఇతర  జిల్లాల నుంచి కూడా విచ్చేశారు. 

ప్రజానాట్య మండలి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న), సినీ నిర్మాత పోకూరి బాబూరావు, వై.ఎస్‌. కృష్ణేశ్వరరావు, నాయుడు గోపి, గోపరాజు విజయ్, శ్రీగిరి వెంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఆలూరు వెంకట రమణారావు, డాక్టర్‌ గంజాం శ్రీనివాసమూర్తి, భుజంగరావు, కెవి రంగారావు , ప్రతిభ కళాశాల నిర్వాహకులు నల్లూరు వెంకటేశ్వర్లు తదితరులు హరనాథరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ రైటర్స్‌ అసోసియేషన్‌ పక్షాన బి గోపాల్, కాకర్ల హరనాథరావుకు నివాళులర్పించారు. సినీనాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు పూలమాల వేసి నివాళి ఘటించారు. హరనాథరావు ఆకస్మిక మృతిపై సీవీఎన్‌ రీడింగ్‌ రూం ప్రత్యేక అధికారి ఈదుపల్లి గుర్నాథరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చొప్పర జాలన్న తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement