హత్య కేసులో నిందితుడి అరెస్ట్ | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితుడి అరెస్ట్

Published Sat, Apr 30 2016 11:57 PM

Murder case accused arrested

లక్కవరపుకోట: హత్య కేసులో నిందితుడ్ని స్థానిక పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ సంజీవరావు, ఎస్సై నరేష్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మండలంలోని రెల్లిగౌరమ్మపేటకు చెందిన దార వెంకటరమణ (32) తన భార్య అప్పలకొండను గురువారం రాత్రి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించగా, అదే రోజు రాత్రి నిందితుడు వెంకటరమణ వీఆర్‌ఓ డీవీ రామదాసు సమక్షంలో పోలీసులకు లొంగిపోయూడు.

దీంతో పోలీసు లు అతడ్ని విచారించగా నేరాన్ని అంగీకరించాడు తన భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి కొత్తవలసలో కోర్టులో హాజరుపరిచారు. హత్యకు సంబంధించిన కత్తిని పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్సై ఎల్.మన్మధరావు, కానిస్టేబుల్స్ పి.ప్రశాంత్‌కుమార్, షేక్ అమీనభీబి, సురేష్ పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement