బీటెక్‌ రవి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి

Municipal Chairperson Slams To MLC Btech Ravi YSR Kadapa - Sakshi

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చిన్నప్ప

పులివెందుల : ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్‌ రవి) వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని పులివెందుల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చిన్నప్ప పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని బీటెక్‌ రవి  పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఫ్యాక్షనిస్టులు ఎవరో జిల్లా ప్రజలందరికి తెలుసున్నారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సౌమ్యుడని.. జిల్లాలోని రాజకీయ నాయకులు, ప్రజలను ఎవరిని అడిగినా చెబుతారన్నారు.

మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రజల మధ్య ఫ్యాక్షనిజాన్ని లేపుతున్నారని సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొనడం జరిగిందన్నారు. కేవలం తమ పార్టీ కార్యకర్తకు శుభాకాంక్షలు తెలిపేందుకే ఎంపీ పెద్ద దండ్లూరు గ్రామానికి వెళ్లారన్నారు.   టీడీపీ నాయకుల చర్యలను ప్రజలు గమనిస్తున్నారని వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top