'అభ్యంతరకర వ్యాఖ్యలెందుకు' | municipal chairman bolisetty srinivas comments on minister manikyala rao | Sakshi
Sakshi News home page

'అభ్యంతరకర వ్యాఖ్యలెందుకు'

Mar 7 2016 4:41 PM | Updated on Mar 29 2019 9:31 PM

మంత్రి పైడికొండల మాణిక్యాలరావు టీడీపీ నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదని , మంత్రిపై ఎవరూ ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు.

మంత్రిపై మునిసిపల్ చైర్మన్ బొలిశెట్ట వ్యాఖ్య
 
తాడేపల్లి గూడెం: మంత్రి పైడికొండల మాణిక్యాలరావు టీడీపీ నాయకులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తగదని , మంత్రిపై ఎవరూ ఎటువంటి ఫిర్యాదులు చేయలేదని మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రిపై టీడీపీ సమన్వయ కర్త ఈలి నాని ఎటువంటి ఫిర్యాదులు చేయలేదన్నారు.  కావాలంటే వీడియో సీడీలు తమ వద్ద ఉన్నాయని వాటి ద్వారా తెలుసుకోవచ్చన్నారు. పత్రికలలో వచ్చిన కథనాల ఆధారంగా మంత్రి మాణిక్యాలరావు సవాల్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
ఎస్పీ, డీఎస్పీ తదితర అధికారులతో మాట్లాడిన మంత్రి మిత్రపక్షమైన టీడీపీతో మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. విజయవాడలో జరిగిన సమావేశంలో కొందరు కార్యకర్తలు తమ ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబు కు తెలిపే సమయంలో వారిని వారించి తాము కూడా ఎన్నికల కేసులలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని అన్నారే తప్ప మంత్రి తమపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఎక్కడా అనలేదని వివరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement