తెలంగాణ కోసం ‘చలో ఢిల్లీ’ | Mumbai TJAC 'Chalo Delhi' for Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ కోసం ‘చలో ఢిల్లీ’

Oct 20 2013 11:04 PM | Updated on Sep 1 2017 11:49 PM

షరతులు లేని సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం కోసం ముంబైటీ ఐకాస నాయకులు ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపట్టారు

షరతులు లేని సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం కోసం ముంబైటీ ఐకాస నాయకులు ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపట్టారు. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం బిల్లును పాస్ చేయాలని, హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాలతో షరతులు లేని సంపూర్ణ తెలంగాణ కావాలని, కేవలం మూడేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని డిమాం డ్‌తో ముంబై టీ-ఐకాస ప్రతినిధుల బృందం ఢిల్లీకి బయలుదేరింది.
 
  శనివారం సాయంత్రం ఏడు గంటలకు ముంబై సెంట్రల్ స్టేషన్ నుంచి ఢిల్లీ స్పెషల్ ట్రైన్ లో ఐకాస చైర్మన్ మూల్ నివాసి మాల, వైస్ చైర్మన్లు బి.హేమంత్‌కుమార్, కె.నర్సింహగౌడ్, కన్వీనర్లు బోగ సుదర్శన్ పద్మశాలి, అల్లెపాండురంగ్ పద్మశాలి తది తరులు బయలుదేరారు. ఢిల్లీకి వెళ్లి వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు, కేంద్ర మంత్రులు, హోం మంత్రిని కలిసి డిమాండ్ల నివేదికను అందజేస్తారు. తెలం గాణ ఐకాస చైర్మన్ కోదండరాం సమ్మతి మేరకు ఈ యాత్ర చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement