ముంబయి మోడల్ రేప్ కేసులో నలుగురి అరెస్ట్ | Mumbai Model's rape case: 4 youth arrested | Sakshi
Sakshi News home page

ముంబయి మోడల్ రేప్ కేసులో నలుగురి అరెస్ట్

Jan 11 2014 10:35 AM | Updated on Jul 28 2018 8:51 PM

ముంబయి మోడల్ సామూహిక అత్యాచారం కేసులో పాతబస్తీకి చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : ముంబయి మోడల్ అత్యాచారం కేసులో పాతబస్తీకి చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్లో ఓ ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు డ్రా చేసిన సందర్భంగా సీసీ కెమెరాల్లో నమోదు అయిన దృశ్యాలు ఆధారంగా నిందితుల్ని గుర్తించారు.  వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా మోడల్పై అత్యాచారానికి పాల్పడి, నగదు, నగలు దోచుకున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించినట్లు సమాచారం.

సామూహిక లైంగికదాడి జరిగింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి న్యూ ఇయర్ ఈవెంట్ అంటూ పిలిచిన దుండగులు మత్తు మందు ఇచ్చి  ముంబై మోడల్‌పై సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు. పూర్తిగా మామూలు స్థితికి రాని ఆమెను ప్రైవేట్ బస్సులో ముంబై పంపించేశారు. దీంతో బాధితురాలు ముంబయి పోలీసుల్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement