
పాదయాత్రకు అడ్డుతొలగే వరకు చలో కిర్లంపూడి: ముద్రగడ
పాదయాత్రకు అడ్డుతొలగే వరకు ‘చలో కిర్లంపూడి’ నిర్వహించాలని కాపు నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు.
అనంతరం తనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వారినుద్దేశించి ముద్రగడ ప్రసంగించారు. ఎన్నికల హామీని అమలు చేయాలని కోరుతుంటే.. సీఎం చంద్రబాబు కాపులను అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.