
బురద ఉత్సవం దృశ్యాలు(ఫైల్)
అవునా నిజమేనా...!అని ఆశ్చర్యపోవద్దు. ఇదో వింతజాతర.బురదమాంబజాతరలో ఎంతటి వ్యక్తి అయినా బురదరాయించుకోవాల్సిందే.
మగవారుఏ వయస్సులో ఉన్నా ఎటువంటిమినహాయింపు ఉండదు. ఆడవారికి మాత్రమే మినహాయింపుఉంటుంది. ఈ విచిత్ర జాతరరాంబిల్లి మండలం దిమిలి గ్రామంలోరెండేళ్లకోసారి నిర్వహిస్తారు.
రాంబిల్లి : బురదమాంబ జాతర రోజు దిమిలిలో ఉంటే ఎంతటివారైనా బురద పూయించుకోవాల్సిందే. మహిళలు పూజలకు మాత్రమే పరిమితం. ఎంతటి స్దాయి వ్యక్తి అయినా వయస్సుతో సంబంధం లేకుండా మగవారైతే చాలు డ్రెయినేజీల్లో బురదలో వేప కొమ్మలు ముంచి ఒంటిపై పూస్తారు. ఇదో వింత పండగ. ఈ గ్రామదేవత దల్లమాంబ జాతరలో భాగంగా అనుపు మహోత్సవం సందర్భంగా రెండేళ్లకోసారి ఈ జాతరను నిర్వహిస్తారు. సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ బురద మహోత్సవం ప్రారంభం అవుతోంది.
మంగళవారం ఉదయం 9గంటల వరకు ఈ జాతర నిర్వహిస్తారు. వేపకొమ్మలు చేతబట్టి ఆయా కొమ్మలను మురుగుకాలువల్లో ముంచి ఆయా బురదను ఒకరిపై ఒకరు పూసుకొని కేరింతలు కొడతారు. గ్రామంలో వీధుల్లో ఈ జాతర నిర్వహిస్తారు. జాతర అనంతరం ఆయా కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద వుంచి పూజలు చేస్తారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా, భక్తుల కొంగుబంగారంలా బురదమాంబ అమ్మవారిని భక్తులు భావిస్తారు. బురద పూసుకున్నప్పటికీ ఎటువంటి చర్మవ్యాధులు సోకకపోవడం అమ్మవారి మహత్మ్యంగా భక్తులు భావిస్తారు. ఈ జాతర నిర్వహణకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
బురదమాంబ అమ్మవారు