ఎమ్మార్పీఎస్ నేత ఆత్మహత్యాయత్నం | mrps leader suicide attempt in ysr district | Sakshi
Sakshi News home page

ఎమ్మార్పీఎస్ నేత ఆత్మహత్యాయత్నం

Mar 10 2016 1:06 PM | Updated on Aug 29 2018 8:38 PM

ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి.

హైదరాబాద్: ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పలు చోట్ల రాస్తారోకోలు చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా వైఎస్సార్ కడపజిల్లా రాజంపేటకు చెందిన ఎంఆర్‌పీఎస్ నాయకుడు చేమూరి వెంకటేష్ మాదిగ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
 
ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం రాత్రి మందకృష్ణమాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. సూర్యాపేటలోని 65వ నంబరు జాతియ రహదారిపై ఎంఆర్‌పీఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement