ఎమ్మెల్యే రమణమూర్తి రాజుకు పరామర్శ

MP Vijaysai Reddy Visitation To For MLA Ramana Murthy Raju - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్ర చికిత్స చేయించుకున్న యలమంచిలి ఎమ్మెల్యే యువీ రమణమూర్తి రాజును శుక్రవారం వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాథ్‌ , గొల్ల బాబూరావు, తిప్పల నాగిరెడ్డి, మల్లా విజయప్రసాద్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, విప్ బూడి ముర్తాల నాయుడు, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తదితరులు పరామర్శించారు. టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యే రమణమూర్తికి అభినందలు తెలిపారు.

సత్తి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు..
సతీ వియోగంతో బాధపడుతున్న విశాఖ వైఎస్సార్‌సీపీ నేత సత్తి రామకృష్ణారెడ్డిని శుక్రవారం వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, విప్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్ నాథ్‌ గొల్ల బాబూరావు, చెట్టి ఫాల్గుణ, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్,  విఎంఆర్డీఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, సిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్, సమన్వయకర్తలు మల్లా విజయప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు, అనకాపల్లి పార్ల మెంట్  అధ్యక్షుడు శరగడం చిన అప్పనాయుడు, కొయ్యా ప్రసాద రెడ్డి, కొండా రాజీవ్ గాంధీ, ఫరూఖీ తదితరులు.. ఇటీవల మృతిచెందిన సత్తి రామకృష్ణారెడ్డి సతీమణి కృష్ణవేణి చిత్రపటానికి పూలమాలల వేసి నివాళుర్పించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top