తల్లీకూతుళ్ల ఆత్మహత్య | Mother commits suicide along with her daughter | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్ల ఆత్మహత్య

May 6 2016 3:57 PM | Updated on Nov 6 2018 7:56 PM

అద్దంకి మండలం దేనుగుకొండ గ్రామ పొలాల్లో శుక్రవారం తల్లీకూతుళ్లు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెట్టుకి ఉరివేసుకుని బలవన్మరణం చెందారు.

అద్దంకి (ప్రకాశం జిల్లా) : అద్దంకి మండలం దేనుగుకొండ గ్రామ పొలాల్లో శుక్రవారం తల్లీకూతుళ్లు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెట్టుకి ఉరివేసుకుని బలవన్మరణం చెందారు. మృతులు చీమకుర్తి మండలం ఇలపావులూరు గ్రామానికి చెందిన పులి రాములమ్మ(35), అనిత(13)లుగా గుర్తించారు. అయితే వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement