రుణమాఫీ మరీ భారం: యనమల రామకృష్ణుడు | More burden to pay loan waiver, says Yanamala ramakrishnudu | Sakshi
Sakshi News home page

రుణమాఫీ మరీ భారం: యనమల రామకృష్ణుడు

Aug 28 2014 1:46 AM | Updated on Mar 18 2019 7:55 PM

రుణమాఫీ మరీ భారం: యనమల రామకృష్ణుడు - Sakshi

రుణమాఫీ మరీ భారం: యనమల రామకృష్ణుడు

బడ్జెట్‌లో అన్ని శాఖలకు ఇవ్వగలిగిన మేరకు నిధులు కేటాయించామని, డబ్బుల్లేకపోతే చేయగలిగిందేమీ లేదని మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పా రు.

సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో అన్ని శాఖలకు ఇవ్వగలిగిన మేరకు నిధులు కేటాయించామని, డబ్బుల్లేకపోతే చేయగలిగిందేమీ లేదని మం త్రి యనమల రామకృష్ణుడు చెప్పా రు. బడ్జెట్ మీద జరిగిన సాధారణ చర్చకు మంత్రి బుధవారం సమాధానం ఇచ్చారు. మూడేళ్లలో ఏ శాఖలు ఎంత ఖర్చు చేశాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేశామని చెప్పారు. తర్వాత కొన్ని శాఖల పద్దులను ఆయా శాఖల మంత్రు లు సభలో ప్రవేశపెట్టారు. సభను గురువారానికి వాయిదా వేశారు. యనమల ఏం చెప్పారంటే...
 హారుణమాఫీ మరీ భారం (హెవీ బర్డన్). ఏదో విధంగా మాఫీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మా ప్రయత్నాలు సఫలం అయినా, కాకపోయినా రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం. డ్వాక్రా మహిళలకు న్యాయం చేస్తాం. సెక్యూరిటైజేషన్ కు సీఎం కమిటీ వేశారు.
 
 - ప్రతిపక్ష నేత వృద్ధిరేటు గురించి మాట్లాడా రు. అవినీతి, దోపిడీ, వాళ్ల సొంత తలసరి ఆదా యం వృద్ధిరేటు బాగుంది తప్ప రాష్ట్రం వృద్ధిరే టు బాగాలేదు. విద్యుత్ ఛార్జీలు టీడీపీ హయాం లో 29.5 శాతమే పెరగగా, గత దశాబ్దంలో 95శాతం పెరిగాయి. కాంగ్రెస్ పాలనలో స్థానిక పన్నులూ పెరి గాయి. ఇప్పుడు విభజనతో మన బ్రాండ్ పడిపోయింది. మళ్లీ గాడిలో పెట్టడానికి బడ్జెట్ సరిపోదు.
 -  పదేళ్లలో చిన్న తరహా పరిశ్రమ లు మూతపడి 2 లక్షల ఉద్యోగాలు పోయాయి. నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వంలో అవి ఖాళీగా ఉన్నాయి. త్వరలో లక్ష ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటాం. ప్రయివేటులో మరో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
 - అన్ని పథకాలకు ఆధార్‌ను లింక్ చేస్తామంటే విపక్ష నేత అపహాస్యం చేస్తున్నారు. ఆధార్ లింక్ చేసి తీరుతాం. సమ్మిళిత అభివృద్ధి ముఖ్యం. సమాజంలో పేదరికాన్ని లేకుండా చేయాలి.
 - వ్యాట్ నష్టపరిహారం, రెవెన్యూ వ్యత్యాసం, కేంద్ర ప్రభుత్వ పథకాలు కలిపి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్‌గా కేంద్రం నుంచి దాదాపు రూ. 28 వేల కోట్లు రానుంది. అందుకే ప్రణాళికా వ్యయం కం టే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఎక్కువగా ఉంది. నిధుల్లేకే ప్రణాళికా వ్యయం తక్కువ పెట్టాం. త్వరలో ఎక్సైజ్ విధానాన్ని మారుస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement