లింగాల : వృద్ధ వానరం చనిపోతే మనకెందుకులే అనుకుని మృతదేహాన్ని అవతల పారేయలేదు.. భక్తితో మృతదేహాన్ని ఊరేగించి ఖననం చేయడమేగాక సమాధి కట్టి అన్నదానం కూడా జరిపారు ఆ గ్రామస్తులు. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో జరిగింది. ఈనెల 19వ తేదీన ఓ వృద్ధ వానరం మృతిచెందింది. ఆ మర్నాడు దాని మృతదేహాన్ని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఖననం చేశారు. ఆ ప్రదేశంలో సమాధి కట్టి శనివారం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రశేఖరరెడ్డి, చెన్నకేశవరెడ్డి, వీరారెడ్డిల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయసహకారాలతో గ్రామ ప్రజలందరికీ అన్న సంతర్పణ నిర్వహించి సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ భర్త సారెడ్డి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వానరం మృతి.. అన్న సంతర్పణ
Dec 23 2017 7:13 PM | Updated on May 28 2018 1:08 PM
Advertisement
Advertisement