ఇసుక తరలింపుపై ఆంక్షల కారణంగా ఉపాధి కోల్పోతున్నామంటూ భవన నిర్మాణరంగ కార్మికులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు.
ఇసుక తరలింపుపై ఆంక్షల కారణంగా ఉపాధి కోల్పోతున్నామంటూ భవన నిర్మాణరంగ కార్మికులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం కట్టుపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి వస్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వాహనాన్ని పెద్ద సంఖ్యలో గుమికూడిన కార్మికులు అడ్డుకున్నారు. ఇసుక తరలింపుపై ఆంక్షల కారణంగా తాము వీధిన పడ్డామని తెలిపారు. ఇసుక కొరత కారణంగా నిర్మాణాలు నిలిచిపోయాయని తెలిపారు. అనంతరం వారు ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని వారికి ఆయన హామీ ఇచ్చారు.