వైఎస్ఆర్ సీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు! | MLA CK Babu joins in YSR Congress | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు!

Apr 9 2014 5:36 PM | Updated on Aug 14 2018 4:21 PM

వైఎస్ఆర్ సీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు! - Sakshi

వైఎస్ఆర్ సీపీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీకే బాబు!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు సన్నిహితుడైన సీకే బాబుకు పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సీకే బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కు సన్నిహితుడైన సీకే బాబుకు పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు.
 
చిత్తూరు ఎమ్మెల్యేగా సీకే బాబు ఉన్నారు. సీకే బాబుగా సుపరిచితులైన సీకే జయచంద్రారెడ్డి తొలుత చిత్తూరు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. ఆతర్వాత 1994, 1999, 2009 లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. 
 
వైఎస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే  పేద ప్రజలకు చేరువతాయని సీకే బాబు విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇరు ప్రాంతాల అభివృద్ది వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని సీకే బాబు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement