మిథున్ రెడ్డికి బెయిల్ | mithun reddy gets bail | Sakshi
Sakshi News home page

మిథున్ రెడ్డికి బెయిల్

Jan 28 2016 2:11 AM | Updated on Sep 3 2017 4:25 PM

మిథున్ రెడ్డికి బెయిల్

మిథున్ రెడ్డికి బెయిల్

రాజంపేట వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తిరుపతి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.

చిత్తూరు: రాజంపేట వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తిరుపతి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడా కూడిన బెయిల్ ఇచ్చింది. నెల రోజుల పాటు నెల్లూరు జిల్లా విడిచి వెళ్లరాదని.. చిత్తూరు జిల్లాలో ఎక్కడా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని షరతులు విధించింది. శ్రీకాళహస్తి వైఎస్సార్ సీపీ ఇన్ చార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రేణిగుంటలో ఎయిరిండియా మేనేజర్‌పై దాడిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో మిథున్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం, నెల్లూరు జిల్లా కేంద్రకారాగారంలో వారు రిమాండ్ అనుభవిస్తుండడం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement