మంత్రి తానేటి వనితకు గాయాలు..

Minister Taneti Vanitha Vehicle Met An Accident In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని భీమడోలులో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ వెళ్తుండగా భీమడోలు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్కార్ట్‌ వాహనం తప్పించబోయిన మంత్రి వాహనం డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో మంత్రి వనితకు స్వల్ప గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top