అక్రమాలకు పాల్పడితే సహించం: మంత్రి వనిత

Minister Taneti Vanitha Review Meeting With ICDS Officials - Sakshi

ఐసీడీఎస్‌ అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి

సాక్షి, అనంతపురం: అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారులు, కాంట్రాక్టర్లపై కఠినచర్యలు తప్పవని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. శనివారం అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారుల పనితీరుపై మంత్రి వనిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదన్నారు. అంగన్‌వాడీలకు చేరాల్సిన సరుకులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు భారీగా దోపిడీ చేశారని.. సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి వనిత స్పష్టం చేశారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top