మున్సిపల్ శాఖకే సిగ్గుచేటు | minister narayana comments on 4-Year-Old Boy Mauled By Stray Dogs Dies | Sakshi
Sakshi News home page

మున్సిపల్ శాఖకే సిగ్గుచేటు: మంత్రి నారాయణ

Sep 22 2017 4:40 PM | Updated on Sep 29 2018 4:26 PM

minister narayana comments on 4-Year-Old Boy Mauled By Stray Dogs Dies - Sakshi

గుంటూరు ఘటనపై ఏపీ పురపాలక మంత్రి నారాయణ స్పందించారు.

అమరావతి: గుంటూరు ఘటనపై ఏపీ పురపాలక మంత్రి నారాయణ స్పందించారు.  గుంటూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విలేకరులతో మాట్లాడుతూ.. బాలుడిని కుక్కలు చంపాయంటే మున్సిపల్ శాఖకు సిగ్గుచేటుగా ఉందన్నారు. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి వివరణ ఇవ్వాలని గుంటూరు కమిషనర్‌తో పాటు పలువురు అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కుక్కల స్టెరిలైజేషన్ పూర్తి స్థాయిలో చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలనా తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement