ఉచితంగా కంటి ఆపరేషన్‌ చేపిస్తాం: నాని

Minister Kodali Nani Launch YSR Kanti Velugu Scheme In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడలోని సత్యనారాయణపురంలో అంద్ర నలంద మున్సిపల్‌ హైస్కూల్‌లో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’పథకాన్ని మంత్రి కొడాలి నాని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కంటి వెలుగు ద్వారా ప్రతి విద్యార్థికి కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే విద్యార్థులకు కళ్లజోళ్లను కూడా అందిస్తామన్నారు. కంటి వెలుగు పరీక్షల్లో ఆపరేషన్‌లు అవసరమైనవారికి ప్రభుత్వమే ఉచితంగా ఆపరేషన్‌ చేపిస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఎవరూ అవగాహన లోపంతో కంటి చూపును కోల్పోకూడదన్న ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. రాష్ట్రంలో ఆరు దశలలో వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం అమలవుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 5.40 కోట్ల ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top