విద్యార్థికి విందు భోజనం | Midday Meal Scheme Menu Change From Today | Sakshi
Sakshi News home page

విద్యార్థికి విందు భోజనం

Jan 21 2020 8:38 AM | Updated on Jan 21 2020 8:38 AM

Midday Meal Scheme Menu Change From Today - Sakshi

కొత్త మెనూ ఫ్లెక్సీని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ గంధం చంద్రుడు , డీఈఓ శామ్యూల్‌

అనంతపురం: ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నుంచి కొత్త మెనూ అమలుకానుంది. జిల్లాలో 3,755 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. 3,37,677 మంది 1–10 తరగతుల విద్యార్థులు మధ్యాహ్న భోజనం స్కూళ్లలో తింటున్నారు. కొత్త మెనూకు సంబంధించిన ఫ్లెక్సీని సోమవారం సాయంత్రం కలెక్టర్‌ గంధం చంద్రుడు, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ కొత్త మెనూ అమలుపై మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ ఇచ్చామన్నారు. అందరూ కొత్త మెనూ తప్పకుండా పాటించాలన్నారు. భోజనం నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement