సమైక్యాంధ్రకు మద్దతుగా ఉదయగిరిలో ఆందోళనలు | mekapati chandrasekhar reddy protest against congress | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్రకు మద్దతుగా ఉదయగిరిలో ఆందోళనలు

Aug 14 2013 6:45 PM | Updated on Oct 20 2018 6:17 PM

సమైక్యాంధ్ర మద్దతుగా ఆందోళనలు మరింత ఊపందుకున్నాయి.

నెల్లూరు: సమైక్యాంధ్ర మద్దతుగా ఆందోళనలు మరింత ఊపందుకున్నాయి. సమ్మె బాటలో సీమాంధ్రలోని ఆందోళనకారులు రోడ్డెక్కారు. జిల్లాలోని ఉదయగిరిలోఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో నిరసనకారులు భారీ ప్రదర్శన నిర్వహించారు.  రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వారు నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకునేది లేదని వారు నినాదాలు చేశారు.
 
 అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం కోరుతూ వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ  చేపడుతున్న ఆమరణ దీక్షతోనైనా కేంద్రం కళ్లు తెరవాలని వైఎస్సార్‌సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజా సమస్యల పోరాటంలో ముందుంటుందని వైఎస్సార్‌సీపీ నేత కాకాని గోవర్థన్ రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement