వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం | Medical student suicide in RIMS | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Oct 26 2015 10:05 AM | Updated on Nov 6 2018 7:56 PM

వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప రిమ్స్‌లో ఆదివారం రాత్రి ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కర్నూలు జిల్లాకు చెందిన సాయికృష్ణ రిమ్స్‌లో ఫస్టియర్ చదువుతున్నాడు.

కడప: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప రిమ్స్‌లో ఆదివారం రాత్రి ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కర్నూలు జిల్లాకు చెందిన సాయికృష్ణ రిమ్స్‌లో ఫస్టియర్ చదువుతున్నాడు.

దసరా సెలవుల అనంతరం ఆదివారం రాత్రి రిమ్స్ హాస్టల్‌కు చేరుకున్న అతడు తన గదిలో ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు సాయిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement