పోలీసులపై ఆధారపడిన వారి తల్లిదండ్రులకు ఆరోగ్య భద్రత పథకంలో వైద్య సేవలు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, అమరావతి: పోలీసులపై ఆధారపడిన వారి తల్లిదండ్రులకు ఆరోగ్య భద్రత పథకంలో వైద్య సేవలు విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్దేశించిన నెట్‌వర్క్ ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పోలీస్ కుటుంబాలకు వైద్య సేవల కోసం నిమ్స్ తరహా ప్యాకేజీలను అందిస్తున్నారు.
అత్యవసర వైద్య సేవలు చేయించుకున్న వారు మెడికల్ బిల్లులు సమర్పిస్తే రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. డీజీపీ నండూరి సాంబశివరావు ప్రతిపాదనలతో ఇకపై ఆరోగ్య భద్రత స్కీమ్‌లో పోలీసుల తల్లిదండ్రులకు వైద్య సేవలు అందించేలా నిర్ణయం తీసుకున్నట్టు అనురాధ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.