వివాహిత ఆత్మహత్య | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Feb 15 2016 2:14 PM | Updated on Nov 6 2018 7:56 PM

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పూర్ణశాసనం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పూర్ణశాసనం గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కర్తలి విజయశాంతి (27)కి వివాహం కాగా ఒక కుమారుడు, ఒక కమార్తె ఉన్నారు. భర్త సింగపూర్‌లో ఉంటుండడంతో విజయశాంతి పిల్లలతో కలసి పూర్ణశాసనం గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement