మావోయిస్టు పోస్టర్ల కలకలం | maoist posters found in macherla | Sakshi
Sakshi News home page

మావోయిస్టు పోస్టర్ల కలకలం

Dec 23 2015 10:59 AM | Updated on Oct 9 2018 2:47 PM

గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో మావోయిస్టు పోస్టర్లు వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది.

మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో మావోయిస్టు పోస్టర్లు వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. బుధవారం ఉదయం గ్రామ ప్రధాన రహదారిపై బడ్డీ కొట్టుకు రెండు పోస్టర్లను అంటించి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పదేళ్ల క్రితం జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌కు గ్రామానికి చెందిన కుక్కమూతి శ్రీనుయే కారణమని అందులో ఆరోపించారు. మావోయిస్టుల పేరుతో నగదు వసూళ్లకు పాల్పడుతున్న అతడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అందులో హెచ్చరించారు. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement