ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై గొడ్డలితో దాడి | Man sleeping in a house with an axe attack | Sakshi
Sakshi News home page

ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై గొడ్డలితో దాడి

Sep 24 2013 5:59 AM | Updated on Aug 24 2018 2:33 PM

లైంగిక వేధింపులు మానుకోవాలని హితవుచెప్పిన బాధిత మహిళ తండ్రిపై ఓ యువకుడు గొడ్డలితో దాడిచేసి గాయపర్చిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్లపాలెం మండలం ఎంవీరాజుపాలెంకు చెందిన అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తెకు గతంలో వివాహమైంది.

బాపట్ల టౌన్, న్యూస్‌లైన్: లైంగిక వేధింపులు మానుకోవాలని హితవుచెప్పిన బాధిత మహిళ తండ్రిపై ఓ యువకుడు గొడ్డలితో దాడిచేసి గాయపర్చిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్లపాలెం మండలం ఎంవీరాజుపాలెంకు చెందిన అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తెకు గతంలో వివాహమైంది. 
 
 అదే గ్రామానికి చెందిన పిట్టు గోపిరెడ్డి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమె తన తండ్రికి ఈ విషయం చెప్పడంతో శ్రీనివాసరెడ్డి తన కుమార్తెపై వేధింపులకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదుచేస్తానని గోపిరెడ్డి బంధువులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి 12.30 సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాసరెడ్డిపై గోపిరెడ్డి గొడ్డలితో దాడిచేశాడు. 
 
 తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరెడ్డికి బాపట్ల ఏరియా వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు కర్లపాలెం స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ వై.అర్జునరావు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement