అనంతపురం జిల్లాలో దారుణ హత్యలు | Man Kills wife and daughters in tadipatri | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో దారుణ హత్యలు

Jul 4 2017 8:39 AM | Updated on Sep 5 2017 3:12 PM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది.

అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యతో పాటు రక్తం పంచుకు పుట్టిన బిడ్డలను కూడా దారుణంగా హతామర్చాడో వ్యక్తి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... స్థానిక కృష్ణాపురం 40 అడుగుల రోడ్డులో రామసుబ్బారెడ్డి ... భార్య, ఇద్దరు కుమార్తెలు మంగళవారం తెల్లవారుజామున దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనలో భార్య సులోచన(45), కుమార్తె ప్రత్యూష(20) అక్కడికక్కడే మృతి చెందారు.

మరో కుమార్తె ప్రతిభ(22) తీవ్ర గాయాలతో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ కలహాలతోనే రామసుబ్బారెడ్డి.... భార్య, పిల్లలను సుత్తితో కొట్టి హతమార్చాడు.  ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement