అనుమానంతో భార్యను చంపిన భర్త | Man Beats Wife To Death over extra-marital affair | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను చంపిన భర్త

Jun 3 2015 3:40 PM | Updated on Jul 29 2019 5:43 PM

అనంతపురం పట్టణంలోని నవోదయకాలనీలో దారుణం చోటుచేసుకుంది.

అనంతపురం టౌన్: అనంతపురం పట్టణంలోని నవోదయకాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఈశ్వరయ్య అనే వ్యక్తి తన భార్య రాజే శ్వరీ(28)ని కొట్టి చంపాడు. రాజేశ్వరీ అనంతపురం మెడికల్ కాలేజీలో స్వీపర్‌గా పనిచేస్తుంది. కొన్ని రోజులుగా ఈశ్వరయ్య తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈశ్వరయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement