
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా సందేశాలు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిఎస్పీ సూర్యనారాయణ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ నేతలపై ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో కడపకు చెందిన న్యూరుల్లా అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే కఠినచర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరించారు.