నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 8th April | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Apr 8 2020 6:49 AM | Updated on Apr 8 2020 6:51 AM

Major Events On 8th April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 314కి చేరుకుంది.
ఇప్పటివరకు నలుగురు  కరోనాతో మృతి చెందగా, ఆరుగురు పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
పదో తరగతి విద్యార్థులకు దూరదర్శన్‌ పాఠాలు
నేటి నుంచి ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బోధన కార్యక్రమాలు ఉంటాయి. 

తెలంగాణ:
రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 404కు చేరింది.
ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 11 మంది మృతి చెందారు.   

జాతీయం:
నేడు పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌
ఉదయం11గంటలకు రాజకీయ పక్షాల నేతలతో మాట్లాడనున్న ప్రధాని
వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్షనేత మిథున్‌రెడ్డి పాల్గొననున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై చర్చ

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,311కి చేరింది. 
► దేశంలో ఇప్పటివరకు 160 మంది మృతి చెందగా, 468 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

అంతర్జాతీయం:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. 
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 81వేలకు చేరింది.
ఇప్పటి వరకు కరోనా నుంచి 3 లక్షల మందియ కోలుకున్నారు.
అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3.95 లక్షలు దాటింది. 
అమెరికాలో ఇప్పటివరకు 12,813 మంది కరోనాతో మృతి చెందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement