పోలీసుల కళ్లు గప్పి మహబూబ్ నగర్లో ఓ ఖైదీ పరారయ్యాడు. అయితే కొద్దిసేపట్లోనే ఆ ఖైదీని పోలీసులు పట్టుకున్నారు.
మహబూబ్ నగర్ : పోలీసుల కళ్లు గప్పి మహబూబ్ నగర్లో ఓ ఖైదీ పరారయ్యాడు. అయితే కొద్దిసేపట్లోనే ఆ ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. ఓ హత్యకేసులో వెంకటయ్య అలియాస్ బొట్టు సత్యం నిందితుడిగా ఉన్నాడు. మహబూబ్ నగర్ ఫ్యామిలీ కోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తూ ఈ రోజు శిక్ష ఖరారు చేసింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే వెంకటయ్య తప్పించుకుని పారిపోయాడు. జిల్లా పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పిల్లలమర్రి దగ్గర వెంకటయ్యను పట్టుకుని జైలుకు తరలించారు.